దేశంలోనే తొలి ఓటరు.. మరోసారి ఓటేసేందుకు సిద్ధమైన 106 ఏండ్ల వృద్ధుడు
Shyam Saran Negi | విధాత: ఓటు హక్కు.. మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయుధం లాంటింది. ఓటు హక్కును అర్హుడైన ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి. మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఓటుకు విలువ ఉంటుంది. 61 ఏండ్ల వయసులో 88వ పెళ్లికి సిద్ధమైన సామాన్య రైతు.. కానీ ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఎన్నికల రోజు సెలవు ప్రకటించినప్పటికీ, ఇండ్లకే […]

Shyam Saran Negi | విధాత: ఓటు హక్కు.. మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయుధం లాంటింది. ఓటు హక్కును అర్హుడైన ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి. మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలి. అప్పుడే మనం వేసిన ఓటుకు విలువ ఉంటుంది.
కానీ ఇటీవలి కాలంలో చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఎన్నికల రోజు సెలవు ప్రకటించినప్పటికీ, ఇండ్లకే పరిమితమవుతున్నారు. కానీ దేశంలోనే తొలి ఓటరు అయిన శ్యాం శరణ్ నేగి.. ప్రతి ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకోని, ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఈ 106 ఏండ్ల వృద్ధుడు సిద్ధమవుతున్నాడు.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
1917, జులైలో జన్మించిన శ్యాం శరణ్ నేగి వృత్తిరీత్యా టీచర్. ఈయన దేశంలోనే తొలి ఓటరు. తొలిసారిగా అక్టోబర్ 25, 1951న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్వరలో జరగబోయే హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోనున్నారు. అంటే 1951 నుంచి ఇప్పటి వరకు నేగి.. అన్ని ఎన్నికల్లో కలిపి 34 సార్లు ఓటేశారు.
అయితే 33వ సారి ఓటు వినియోగించుకున్న సమయంలో ఆయన నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. కానీ తొలిసారిగా నేగి.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నేగి అనారోగ్యానికి గురి కావడంతో.. ఎన్నికల అధికారులే ఆయన ఇంటికి వచ్చారు. రెడ్ కార్పెట్ తో ఆ వృద్ధుడికి స్వాగతం పలికారు. టీచర్ గా 1975లో పదవీ విరమణ పొందారు నేగి.
బొట్టు పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ ఇస్తా.. మహిళా జర్నలిస్టుతో అనుచిత వ్యాఖ్యలు
