Friday, October 7, 2022
More
    Home latest విద్వేషాలు కాదు, పరిపాలన మీద దృష్టి సారించండి: మంత్రి హరీశ్ రావు

    విద్వేషాలు కాదు, పరిపాలన మీద దృష్టి సారించండి: మంత్రి హరీశ్ రావు

    విధాత‌: తమకు ఎలాంటి నిధులు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కనీసం తమ వద్ద ఉన్న మంచి పనులు నేర్చుకొని వెళ్లండని కేంద్ర మంత్రులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

    తెలంగాణలో పర్యటిస్తున్నారు తప్ప.. నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి చూపించడం సరికాదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ అధ్వాన్నంగా ఉందని.. వచ్చి బాగు చేయండని అన్నారు. విద్వేషాలు కాదు, పరిపాలన మీద దృష్టి సారించాలని సూచించారు.

    గాంధీ ఆస్పత్రిలో పిడీయాట్రిక్ ఐసీయూ, సర్జరీ ఐసీయూ, ఎంఐసీయూ, సెమినార్ హాల్స్‌ను మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ విషయంలో ఒక నీతి, రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ఒక నీతి అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

    ఒకే దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల విషయంలో ద్వంద్వ పద్ధతి సారి కాదన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు ఎయిమ్స్‌కు ఎందుకు వర్తించదు? వైద్య విద్య విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరు పాలసీలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్లు, ప్రొఫెసర్లు లేకుండానే ఎయిమ్స్ ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు బీబీనగర్ నిమ్స్‌ను విజిట్ చేయాలని కోరుతున్నానని హరీశ్ రావు తెలిపారు

    RELATED ARTICLES

    అయ్యబాబోయ్.. థమన్‌ని పట్టుకోలేకపోతున్నారుగా!

    విధాత: థమన్.. టాలీవుడ్‌లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న పేరు. ఆయన సంగీతానికి ఇప్పుడు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సంగీతం అందించిన సినిమా అంటే.. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు మార్పించుకుంటున్న థియేటర్స్...

    మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్‌!

    విధాత: రెగ్యుల‌ర్‌గా క్రెడిట్ కార్డు వినియోగించే క‌స్ట‌మ‌ర్ల‌కు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా శుభ‌వార్త వినిపించింది. రూపే క్రెడిట్ కార్డుతో రూ.2000 వ‌ర‌కు జ‌రిపే యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ మీద...

    గరికపాటినీ వదలని మెగా బ్రదర్.. సోషల్ మీడియాలో సెటైర్!

    విధాత: ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’.. ఇది నాగబాబు చేసిన ట్వీట్. ఇది గరికపాటి వారినే అని ఎలా, ఎందుకు అనుకోవాలి...

    Most Popular

    ఆస్కార్‌కు RRR.. ఇప్పుడైనా కల నెరవేరుతుందా?

    విధాత: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘RRR’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి...

    You cannot copy content of this page