Food Poison 100 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత భీంగల్, నిజామాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. 100కు పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అంతలోపే కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పడంతో, భీంగల్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా, విద్యార్థినులకు తీవ్రంగా వాంతులు […]

Food Poison
- 100 మందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత
- భీంగల్, నిజామాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స
విధాత ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. 100కు పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అంతలోపే కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పడంతో, భీంగల్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా, విద్యార్థినులకు తీవ్రంగా వాంతులు కావటం మొదలైంది.
వైద్యులు, వసతి గృహం సిబ్బంది అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి బాధిత విద్యార్థినులను హుటాహుటిన అంబులెన్స్ లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 80 మంది విద్యార్థినులను ఆస్పత్రిలో చేర్పించగా, వారిలో 15 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆస్పత్రికి చేరుకుని బాధిత విద్యార్థినులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. కాగా కస్తూర్బా పాఠశాలలో మొత్తం 270 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో సుమారు 100 మందికి పైగా విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొందరు భయాందోళనలతో తమ పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లగా, మరికొందరు తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు.
