RS Praveen Kumar| విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప వద్ద నిర్మిస్తున్న కాలేశ్వరం ప్యాకేజీ 21, 22 భాగంగా నిర్మిస్తున్న కొండెం చెరువును బీస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మంచిప్ప ప్రాజెక్టు ముప్పు గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. కెసీఆర్ ధన దాహంతోనే మంచిప్ప ప్రాజెక్ట్ రి-డిజైన్ చేస్తున్నాడు. తెలంగాణ పాలకుల ధన దాహానికి 1400 ఎకరాల పట్టా భూమి, 800 అటవీ భూమి, 10,000 మంది […]

RS Praveen Kumar|

విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప వద్ద నిర్మిస్తున్న
కాలేశ్వరం ప్యాకేజీ 21, 22 భాగంగా నిర్మిస్తున్న కొండెం చెరువును బీస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మంచిప్ప ప్రాజెక్టు ముప్పు గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. కెసీఆర్ ధన దాహంతోనే మంచిప్ప ప్రాజెక్ట్ రి-డిజైన్ చేస్తున్నాడు.

స్వరాష్ట్రంలో తమ స్వంత భూములను కాపాడుకోవాల్సిన పరిస్థితిని కేసీఆర్ ఏర్పరచాడు..105 కోట్లతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు పేరుతో అధికారులు, భారస ఎమ్మెల్యేలు ధవాత్ లు చేసుకుంటున్నారు. నిన్న రైతు దినోత్సవం దేని కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తు, రైస్ మిల్లుల యాజమాన్యాల దౌర్జన్యంతో రైతు సతమతమవుతుంటే కెసిఆర్కి కనబడడం లేదా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం 21, 22 ప్యాకేజీలో భాగంగా చేపట్టిన మంచిప ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసం ఆయకట్టు విస్తీర్ణం పెరగకపోయినా 300 కోట్ల లబ్ధి కోసం రి-డిజైన్ చేపట్టారు.. మూడు గ్రామ పంచాయతీలు ఎనిమిది తండాల గిరిజనుల వారి బ్రతుకులను నిన్న నీటిలో ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ పదివేల మందిని నిజాంబాద్ లో అడ్డ కూలీలుగా మార్చడానికి కేసీఆర్ రి-డిజైన్ చేపట్టినట్లు వెల్లడించారు. కాళేశ్వరంతో ఎలాంటి ప్రయోజనం లేదు. స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత ప్రాజెక్ట్ ముప్పు గ్రామాలు పర్యటించాలి. కేసీఆర్ బడులు, విశ్వవిద్యాలయలు ఎందుకు కట్టడం లేదు ప్రాజెక్ట్లు ఎందుకు కడుతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి.

కేసీఆర్ తన వ్యవసాయ భూములు ముప్పు గ్రామాలకు ఇచ్చి మంచిప్ప రి-డిజైన్ చేసుకో బీస్పీ పార్టీ భూములు కోల్పోయిన రైతుల పాక్షన పోరాడుతుంది.. దశాబ్ది ఉత్సవాల కోసం దేశంలోని చిన్న చితక పత్రికల్లో ప్రకటనలు చేస్తూ 200 కోట్ల రాష్ట్ర ప్రజల ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. బీస్పీ రురల్ ఇంజర్జ్ కళ శ్రీనివాస్, ముప్పు గ్రామాల కమిటీ సభ్యులు శంకర్ నాయక్, రాజేష్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 4 Jun 2023 11:16 AM GMT
krs

krs

Next Story