Sunday, December 4, 2022
More
  HomeBreakingఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

  విదాత: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసును ద‌ర్యాప్తు చేసేందుకు ప్ర‌భుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు.

  హైదరాబాద్ కమిషనర్‌ సీవీ ఆనంద్ ఈ దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించనుండగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి స‌భ్యులుగా కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు హోం శాఖ కార్య‌ద‌ర్శి బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

   

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page