Somesh Kumar | CM
విధాత: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన ప్రధాన సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (Somesh Kumar) ను నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమేశ్‌ను సీఎం ప్రధాన సలహాదారుడిగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సోమేశ్ కుమార్‌కు కేబినెట్ హోదా కల్పించారు. సోమేశ్ కుమార్ ఈ పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు.
తెలంగాణ సీఎస్‌గా ఎక్కువ కాలం పని చేసిన సోమేశ్ కుమార్‌ను వాస్తవంగా రాష్ట్ర విభజనలో ఏపీ కేడర్‌కు కేటాయించారు. అయితే ఆయన ఏపీకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. సోమేశ్‌తో ఏపీకి కేటాంచబడిన మరి కొంత మంది అధికారులపై వివాదం నడిచింది. సోమేశ్ కేసును విచారించిన హైకోర్టు చివరకు సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీంతో తప్పని సరి పరిస్థితిలో ఏపీకి వెళ్లిన సోమేశ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సోమేశ్ కుమార్‌ను సీఎం మహారాష్ట్రలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభకు వెళ్లారు. బీఆర్‌ఎస్ అధినేతతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన మాజీ సీఎస్‌ను సీఎం కేసీఆర్ తన ప్రధాన సలహదారుడిగా నియమించుకోవడం గమనార్హం. ఈ సంద్భంగా తనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా నియమించినందుకు సోమేశ్‌కుమార్ సీఎం కేసీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు