Sourav Ganguly | టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొత్త అవసరం ఎత్తబోతున్నారు. ఇప్పటి వరకు క్రికెటర్‌గా, కామేంటేటర్‌గా విభిన్న పాత్రలో పోషించిన దాదా.. పారిశ్రామికవేత్తగా మారబోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మెదినీపూర్ సల్బోనీలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజులు స్పెయిన్, దుబాయి పర్యటనకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడిన ప్రతినిధి వెళ్లింది. అందులో గంగూలీ సైతం ఉన్నారు. అయితే, ప్లాంట్ రాబోయే ఐదారు నెలల్లో […]

Sourav Ganguly | టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొత్త అవసరం ఎత్తబోతున్నారు. ఇప్పటి వరకు క్రికెటర్‌గా, కామేంటేటర్‌గా విభిన్న పాత్రలో పోషించిన దాదా.. పారిశ్రామికవేత్తగా మారబోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మెదినీపూర్ సల్బోనీలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజులు స్పెయిన్, దుబాయి పర్యటనకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడిన ప్రతినిధి వెళ్లింది. అందులో గంగూలీ సైతం ఉన్నారు. అయితే, ప్లాంట్ రాబోయే ఐదారు నెలల్లో ఫ్యాక్టరీ పనులు పూర్తికానున్నట్లు పేర్కొన్నారు.
బెంగాల్‌లో మూడో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నందుకు బెంగాల్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, గంగూలీ ఇప్పటికే స్టీల్ ఇండియా లిమిటెడ్‌లో వాటాదారుగా కొనసాగుతున్నారు. 2007లో చిన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించామన్న గంగూలీ.. ఇటీవల మాడ్రిడ్‌లో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రసంగించారు. వచ్చే ఏడాది కాలంలో అత్యాధునిక ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. 50-55 సంవత్సరాల కిందట తన తాత ప్రారంభించిన కుటుంబ వ్యాపారం గురించి సైతం స్పందించారు.
ఇందు కోసం దాదాపు రూ.2500కోట్లు పెట్టబడి పెట్టాలని నిర్ణయించారు. ఇక ఈ కంపెనీ ద్వారా దాదాపు 6వేల మంది ఉద్యోగాలు దొరకనున్నాయి. ఇప్పటికే తొలి రెండు ప్లాంట్లను అసన్సోల్, పాట్నాలో స్థాపించారు. బెంగాల్ వ్యాపారం కోసం ప్రపంచ దేశాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తున్నది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ పెట్టుబడుల కోసం మమతా బెనర్జీ ఈ విదేశీ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.
