BRS తీర్థం పుచ్చుకున్న విజయవాడ మాజీ మేయర్
విధాత: బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) పార్టీలో ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు చేరుతున్నారు. తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్.. శకుంతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. […]

విధాత: బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) పార్టీలో ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు చేరుతున్నారు. తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్.. శకుంతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏపీలో భవిష్యత్‌లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పారు.
ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని తాడి శకుంతల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.
తాడి శకుంతల 2005-06 మధ్య కాలంలో విజయవాడ మేయర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏండ్లు పని చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు. 2019లో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
