- పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో చేరిక.. మెదక్‌లో బలపడనున్న కాంగ్రెస్
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి (Patolla Shasidhar Reddy) స్వంత గూటికి చేరుకున్నారు. పట్లోళ్ల శశిధర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ (ప్రస్తుత బీఅర్ఎస్) పార్టీ పొత్తులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం స్థానాన్ని టీఅర్ఎస్‌కు కేటాయించగా పొత్తును విభేదించి స్వతంత్ర అభ్యర్థిగా జనతా పార్టీ ( రైతు నాగలి) పై పోటీ చేసి దివంగత మాజీ మంత్రి కారణం రాంచందర్ రావు సతీమణి ఉమా దేవి పై 4 వేల పై చిలుక ఓట్లతో శశిధర్ రెడ్డి గెలుపొందారు.
ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుండి స్థానికేతరుడు వై.ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉండగా ఇక్కడ 3 వస్తానానికి పరిమితమైయింది. సీఎంగా వై యస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో శశిధర్ రెడ్డి కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగారు. శశిధర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు.శశిధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉమ్మడి మెదక్ జిల్లా కు సేవలందించారు.
గతంలో శశిధర్ రెడ్డి నీ కాదని కాంగ్రెస్ అధిష్టానవర్గం సినీ నటి విజయశాంతికి టికెట్ కేటాయించడంతో మెదక్ నుండి పోటీ చేయగా పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఒడిపాయారు.తన ఓటమికి శశిధర్ రెడ్డి కారణమని అధిష్టాన వర్గానికి విజయ శాంతి పిర్యాదు చేశారు.దీంతో శశిధర్ రెడ్డి బీజేపీ లో చేరారు. కొద్దీ రోజుల తరువాత విజయ శాంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరారు.
బీజేపీ లో విజయశాంతి తనకు టికెట్ రానివ్వదని బావించి బీజేపీకి కొద్దిరోజుల క్రితం శశిధర్ రెడ్డి రాజీనామా చేసి కొద్దీ రోజులు వేచి చూశారు.ఇటీవలనే విధాత శశిధర్ రెడ్డిపై ప్రత్యేక కథనం రాసింది.పొలిటికల్ చౌరస్తాలో శశిధర్ రెడ్డి అని కొద్దీ రోజుల క్రితం ప్రచురించింది.కాంగ్రెస్ లో చేరడంతో స్వంత ఇంటికి వచ్చినట్లుందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.శశిధర్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడనుంది.