HomelatestBhupalpally | మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

Bhupalpally | మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్

  • భారీ మొత్తంలో నగదు రూ. 76 లక్షల57వేలు, వస్తువులు స్వాధీనం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను భూపాలపల్లి (Bhupalpally) జిల్లా పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు వారి నుంచి పెద్ద మొత్తంలో రూ.76 లక్షల 57 వేల నగదుతో పాటు సుమారు రెండు లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు.

కాటారం పోలీసులు స్థానిక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా B.NO: WB 94 P 4855 గల బ్లాక్ కలర్ స్కార్పియో వాహనతనిఖీ చేశారు. ఇందులో నలుగురు వ్యక్తులు, భారీ మొత్తంలో డబ్బు, అనుమానస్పదమైన వస్తువులు కనిపించినాయి. Samsung ట్యాబ్, మందులు, సిరప్ సీసాలు, క్యాసియో వాచీలు, న్యూట్రిషన్ పౌడర్ , జెలెటిన్ స్టిక్స్ ,డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, వైట్ టవల్స్ గుర్తించారు.వారిని విచారించారు.

నిందితుల వివరాలు

కరీంనగర్ కు చెందిన బీడీ ఆకు కాంట్రాక్టర్ అబ్దుల్ అజీజ్, మొహమ్మద్ అబ్దుల్ రజాక్,జనగామ రాఘవ్,కౌసర్ అలీలను అరెస్టు చేశారు. అబ్దుల్ అజీజ్ 2009 నుంచి బీడీ కాంట్రాక్టర్ గా భూపాలపట్నం ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 2014లో మావోయిస్టులతో ఏర్పడిన పరిచయాల్లో భాగంగా ప్రతి ఏటా వారికి నగదు చెల్లి స్తున్నారు.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా కాంట్రాక్టు కింద డబ్బులు చెల్లించడంతో పాటు మావోయిస్టులు కోరిన వస్తువులను వారికి అందించేందుకు వెళుతున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా పనిచేసిన OSD అశోక్ కుమార్, కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ రంజిత్ రావు, కాటారం ఎస్సై శ్రీనివాస్, మాహా దేవ్పూర్ ఎస్సై రాజకుమార్, కాలేశ్వరం ఎస్సై లక్ష్మణరావు,కొయ్యూరు ఎస్ఐ నరేష్, అడవి ముత్తారం ఎస్ఐ సుధాకర్ లను ఎస్పీ సురేందర్ రెడ్డి అభినందించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular