Fox And Deer | జాతి వైరం మరచి కొన్ని జీవులు స్నేహం చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. పంచతంత్రం కథల్లో అమాయకత్వానికి మారుపేరుగా జింకను, కపటత్వానికి మారుపేరుగా నక్కను చెబుతారు. గుంట నక్క ఎప్పుడూ జింకను వేటాడటానికే చూస్తుందని మనం చదివి ఉంటాం. అయితే యూకేలోని బార్షా పార్క్‌లో ఒక నక్క, జింక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి. ఇవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నాయని.. రోజంతా కలిసే ఉంటున్నాయని తెలుస్తోంది. ఫ్రెండ్స్ ఆఫ్ బార్షా పార్క్ అనే […]

Fox And Deer |
జాతి వైరం మరచి కొన్ని జీవులు స్నేహం చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. పంచతంత్రం కథల్లో అమాయకత్వానికి మారుపేరుగా జింకను, కపటత్వానికి మారుపేరుగా నక్కను చెబుతారు.
గుంట నక్క ఎప్పుడూ జింకను వేటాడటానికే చూస్తుందని మనం చదివి ఉంటాం. అయితే యూకేలోని బార్షా పార్క్‌లో ఒక నక్క, జింక చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయి.
ఇవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నాయని.. రోజంతా కలిసే ఉంటున్నాయని తెలుస్తోంది. ఫ్రెండ్స్ ఆఫ్ బార్షా పార్క్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది.
ఇది తమకు డిస్నీ ఫిల్మ్‌ను చూసిన భావనను కలిగిస్తోందని కొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. దీనిని షూట్ చేసిన వ్యక్తికి వేల ధన్యవాదాలని మరొకరు పేర్కొన్నారు.
