Credit Cards, AIRPORT LOUNGE విధాత‌: విమానాలు ఆల‌స్య‌మైన‌ప్పుడు, ఇత‌ర ఇబ్బందులు త‌లెత్తిన‌ప్పుడు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఎయిర్‌పోర్టు (AIRPORT)లు, ఎయిర్‌లైన్స్‌ (AIRLINES), కొన్ని థ‌ర్డ్‌ పార్టీ కంపెనీలు లాంజ్ (LOUNGE) సేవ‌ల‌ను క‌ల్పిస్తున్నాయి. వీటిల్లో ల‌గ్జ‌రి స‌దుపాయాలుంటాయి. ఓ ఫైవ్ స్టార్‌ హోట‌ల్‌లో ఉన్న అనుభూతిని పొంద‌వ‌చ్చు. ఈ లాంజ్‌ల్లో ప్ర‌యాణికులు విశ్రాంతి తీసుకోవ‌చ్చు. భోజ‌నం, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి పానీయాలు, కొన్ని చోట్ల డిమాండ్ మేర‌కు లిక్క‌ర్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర ఏర్పాట్లూ ఉంటాయి. అయితే […]

Credit Cards, AIRPORT LOUNGE

విధాత‌: విమానాలు ఆల‌స్య‌మైన‌ప్పుడు, ఇత‌ర ఇబ్బందులు త‌లెత్తిన‌ప్పుడు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఎయిర్‌పోర్టు (AIRPORT)లు, ఎయిర్‌లైన్స్‌ (AIRLINES), కొన్ని థ‌ర్డ్‌ పార్టీ కంపెనీలు లాంజ్ (LOUNGE) సేవ‌ల‌ను క‌ల్పిస్తున్నాయి. వీటిల్లో ల‌గ్జ‌రి స‌దుపాయాలుంటాయి. ఓ ఫైవ్ స్టార్‌ హోట‌ల్‌లో ఉన్న అనుభూతిని పొంద‌వ‌చ్చు.

ఈ లాంజ్‌ల్లో ప్ర‌యాణికులు విశ్రాంతి తీసుకోవ‌చ్చు. భోజ‌నం, టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి పానీయాలు, కొన్ని చోట్ల డిమాండ్ మేర‌కు లిక్క‌ర్ స‌ర‌ఫ‌రా త‌దిత‌ర ఏర్పాట్లూ ఉంటాయి. అయితే కొన్ని లాంజ్‌ల్లోకి స‌భ్య‌త్వం ఉంటేనే వెళ్ల‌వ‌చ్చు. లేక‌పోతే భారీగా చెల్లించాల్సి ఉంటుంది.

కానీ కొన్ని క్రెడిట్ కార్డుదారులకు కాంప్లిమెంట‌రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉన్న‌ది. చార్జీలున్నా చాలా త‌క్కువే. దేశ‌, విదేశాల్లో ఎంపిక చేసిన ఎయిర్‌పోర్టుల్లోకి చాలా క్రెడిట్ కార్డుల ద్వారా యాక్సెస్ ఉన్న‌ది.

క్రెడిట్ కార్డు (CREDIT CARD) వారిచ్చే సౌక‌ర్యాల ఆధారంగా వార్షిక ఫీజులుంటాయి. క‌నిష్ఠంగా రూ.2,500, గ‌రిష్ఠంగా రూ.60,000 వ‌ర‌కు ఉంటుంది. దాదాపు అన్ని బ్యాంకులూ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌తో క్రెడిట్ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. కొన్నింటిలో లాంజ్ యాక్సెస్ ప‌రిమితంగా, మ‌రికొన్నింటిలో అప‌రిమితంగా ఉంటుంది.

ఎలా వెళ్ల‌వ‌చ్చు?

ముందుగా లాంజ్ రిసిప్ష‌న్ వ‌ద్ద‌కు వెళ్లాలి. అక్క‌డ మీ బోర్డింగ్ పాస్‌ను చూపించాలి. ఆపై మీ వ‌ద్ద‌నున్న క్రెడిట్ కార్డునూ ఇవ్వాలి. రిసిప్ష‌న్‌లోని ప్ర‌తినిధి మీ కార్డును స్వైప్ చేస్తారు. ఫ్రీ యాక్సెస్ ఉంటే వెళ్ల‌వ‌చ్చు. లేక‌పోతే నామిన‌ల్ చార్జీ ఉంటుంది. ఇది రూపాయి, రెండు రూపాయిలే ఉండ‌వ‌చ్చు. ఒక‌వేళ ఆఫ‌ర్ లేక‌పోతే అడిగినంత చెల్లించాల్సిందే.

ఆఫ‌ర్ యాక్సెస్ తెలుసుకోవ‌డం ఎలా?

బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి మై ఇన్ఫ‌ర్మేష‌న్ కింద క్రెడిట్ కార్డు కాంప్లిమెంట‌రీ విజిట్ సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. ఒక‌వేళ అక్క‌డ కాంప్లిమెంట‌రీ విజిట్స్ లేక‌పోతే సెక్ష‌న్ ఓపెన్ కాదు. దీన్ని బ‌ట్టి మీ కార్డుకు Iన్న ప‌రిమితుల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉన్న టాప్ 10 క్రెడిట్ కార్డులు

1. HDFC వీసా సిగ్నేచ‌ర్‌
2. HDFC బ్యాంక్ డైన‌ర్స్ క్ల‌బ్ బ్లాక్‌
3. యాత్రా SBI
4. SBI అడ్వాంటేజ్ ప్లాటినం
5. SBI ప్లాటినం కార్పొరేట్‌
6. AXIS బ్యాంక్ మైల్స్ అండ్ మోర్ వ‌ర‌ల్డ్‌
7. AXIS బ్యాంక్ ప్రివిలేజ్‌
8. AXIS బ్యాంక్ సిగ్నేచ‌ర్‌
9. IndusInd బ్యాంక్ ప్లాటినం ఆరా
10. IndusInd బ్యాంక్ ప్లాటినం సెలెక్ట్‌

కాంప్లిమెంట‌రీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్‌తో ఉచిత భోజ‌నం, వైఫై త‌దిత‌ర సదుపాయాల‌ను పొంద‌వ‌చ్చు. ఒక‌వేళ ఈ సౌక‌ర్యాల‌కు చెల్లించాల్సి వ‌చ్చినా అవి చాలా త‌క్కువగా ఉంటాయి.

అయితే ఈ కాంప్లిమెంట‌రీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ మీ ద‌గ్గ‌రున్న డెబిట్ కార్డు (DEBIT CARD) ర‌కం పైనే ఆధారప‌డి ఉంటుంది.

కాంప్లిమెంట‌రీ ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ ఉన్న టాప్ 10 డెబిట్ కార్డులు

1. ఇంట‌ర్‌మైల్స్ HDFC సిగ్నేచ‌ర్
2. HDFC ఈజీషాప్ ప్లాటినం
3. AXIS ప్ర‌యార్టీ
4. ICICI కోర‌ల్ ప్ల‌స్‌
5. SBI ప్లాటినం ఇంట‌ర్నేష‌న‌ల్‌
6. KOTAK ప్రైవీ లీగ్ సిగ్నేచ‌ర్‌
7. ICICI కోర‌ల్ పేవేవ్ కాంటాక్ట్‌లెస్‌
8. IndusInd వ‌ర‌ల్డ్‌ ఎక్స్‌క్లూజివ్‌
9. IDFC ఫ‌స్ట్ బ్యాంక్ వీసా సిగ్నేచ‌ర్‌
10. YES ప్రాస్ప‌రిటీ ప్లాటినం

Updated On 28 Feb 2023 8:15 AM GMT
Somu

Somu

Next Story