Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌న్యాయ సేవ అధికార సంస్థతో ఉచిత న్యాయ సేవలు: జితేందర్

  న్యాయ సేవ అధికార సంస్థతో ఉచిత న్యాయ సేవలు: జితేందర్

  విధాత, మెదక్ బ్యూరో: నూతనంగా ఏర్పడిన మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారి అధ్వర్యంలో (లీగల్ అవేర్నెస్ అండ్ సెన్సిటై జేటియన్) న్యాయ అవగాహన సదస్సు నిర్వహిం చారు. కార్య‌క్రమంలో జిల్లా సెక్రెటరీ శ్రీ జితేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య, నామినేటెడ్ సభ్యులు S.కరుణాకర్ ప్యానల్ advocates, సీనియర్ అడ్వకేట్ లు, జూనియర్ అడ్వకేట్ లు పాల్గొన్నారు.

  స‌ద‌స్సులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేసే పనులు, సేవలు, సభ్యుల భాద్యతలు, ఇతర ముఖ్య అంశాల మీద సవివరంగా జిల్లా కార్యదర్శి జితేందర్ వివరించారు. అలాగే సభ్యుల సందేహాలు నివృత్తి చేశారు. జిల్లా న్యాయ సేవా సంస్థ రాబోవు కాలంలో చేయబోయే కార్యక్రమాలు, సామాన్య ప్రజానీకానికి అందవలసిన ఫలాలు, దానికోసం రూపొందించాల్సిన కార్యాచరణ గురించి సవివారంగా తెలిపారు.

  రాబోవు రోజుల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చాలా మందికి ఉచిత న్యాయ సేవ అందుతుందని, ఇట్టి విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన భాధ్యత అందరి మీదా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  న్యాయ సేవా సంస్థకు తమవంతు సహకారం అందిస్తామని ప్రెసిడెంట్ బాలయ్య వారీ సంఘీభావాన్ని తెలుపుతూ, మెదక్ జిల్లాకు సంస్థ రావడాన్ని స్వాగతించారు.

  కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేయదగ్గ పనులు వాటి పర్య‌వసనాల గురించి వివరించి కార్యక్రమాన్ని ముగించారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular