పదివేల కాయిన్ల అమ్మకం.. బ్లాకులో సైతం కొనుగోళ్లు NTR | విధాత‌: ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా అయన ప్రతిష్ట, ఆయన వెలుగును ప్రపంచం నాలుగు చెరగులా ప్రచారం చేసేందుకు ఆయన కుటుంబం చేసిన ప్రయత్నం మంచిఫలితాలను ఇస్తోంది. ఆయన శత జయంతి సందర్భంగా భారీగా సభలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా రూ. 100 విలువైన నాణెం సైతం సైతం విడుదల చేసారు. మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారధ్యంలో ఏర్పాటు చేసిన […]

  • పదివేల కాయిన్ల అమ్మకం.. బ్లాకులో సైతం కొనుగోళ్లు

NTR | విధాత‌: ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా అయన ప్రతిష్ట, ఆయన వెలుగును ప్రపంచం నాలుగు చెరగులా ప్రచారం చేసేందుకు ఆయన కుటుంబం చేసిన ప్రయత్నం మంచిఫలితాలను ఇస్తోంది. ఆయన శత జయంతి సందర్భంగా భారీగా సభలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా రూ. 100 విలువైన నాణెం సైతం సైతం విడుదల చేసారు. మొన్న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ నాణెం విడుదల సభకు ఎన్టీయార్ కుటుంబ సభ్యులు చాలామంది హాజరు అయ్యారు.

రూ.100 ముఖ విలువ (దీన్ని మిగతా నాణెముల మాదిరి మారకం చేసుకునేందుకు వీలు కాదు. ) ఉన్న ఈ నాణెంను అమ్మకానికి ఉంచగా దీనికి భారీగా డిమాండ్ ఏర్పడింది. వీటిని ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అమ్మకాలకు పెట్టగా దేశ విదేశాల్లోని ఎన్టీయార్ అభిమానులు ఆనాణెం కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో ఉంచిన నాణేలు రెండ్రోజుల్లోనే అభిమానులు కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోనూ.. చర్లపల్లిలోని మింట్ కేంద్రాల్లో ఈ నాణెం అమ్మకానికి అందుబాటులో ఉంచారు. మొత్తం 12వేల నాణెల్ని ముద్రించగా ఇవన్నీ దాదాపు అమ్ముడైనట్లు తెలుస్తోంది . నాలుగు తరహాల్లో ఈ కాయిన్లు అమ్మకానికి పెట్టగా.. చెక్క పెట్టెలో పొందుపర్చిన నాణెన్ని కొనుగోలు చేయటానికి అభిమానులు ఎగబడ్డారు. దీన్ని రూ.4 - 5 వేల మధ్య అమ్ముతున్నారు.

చెక్క పెట్టెలో నాణెల స్టాక్ అయిపోవటంతో.. త్వరలోనే మరిన్ని నాణెల్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ నాణెం ను కొందరు రూ. 10 వేలకు సైతం బ్లాకులో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే అభిమానులు అధిక డబ్బు పెట్టి దాన్ని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Updated On 2 Sep 2023 12:10 PM GMT
somu

somu

Next Story