సిరిసిల్ల నేత కార్మికుని అద్భుత ప్రతిభ గతంలో నేసిన లోగోకు ప్రధానిచే ప్రశంసలు ఔరా అనిపిస్తున్న వెల్ది హరిప్రసాద్ G20 | విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జీ20 సమావేశాల సందర్భంగా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. వస్త్రంపై జీ20 నమూనా నేసి ఔరా అనిపించారు. గతంలో జీ20 సదస్సు లోగోను వస్త్రంపై నేసిన హరి ప్రసాద్, దాన్ని ప్రధాని […]

  • సిరిసిల్ల నేత కార్మికుని అద్భుత ప్రతిభ
  • గతంలో నేసిన లోగోకు ప్రధానిచే ప్రశంసలు
  • ఔరా అనిపిస్తున్న వెల్ది హరిప్రసాద్

G20 | విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జీ20 సమావేశాల సందర్భంగా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. వస్త్రంపై జీ20 నమూనా నేసి ఔరా అనిపించారు. గతంలో జీ20 సదస్సు లోగోను వస్త్రంపై నేసిన హరి ప్రసాద్, దాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా పంపించారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని, సిరిసిల్ల కళాకారుని అద్భుత ప్రతిభను అభినందించారు. తాజాగా జీ20 సదస్సుకు హాజరవుతున్న 20 దేశాల అధ్యక్షులు, ప్రధానుల చిత్రాలు ఓవైపు, భారతదేశ పటం మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రం మరోవైపు, బార్డర్ చుట్టూ జీ20 లోగో వచ్చేలా చేనేత వస్త్రంపై సదస్సుకు జీవం పోశారు.

చేనేత వృత్తిపై ఆధారపడిన తాను ప్రపంచ దేశాలకు స్వాగతం పలికే ఉద్దేశంతో, ప్రత్యేకించి దీన్ని తయారు చేసినట్టు హరిప్రసాద్ చెప్పారు. రెండు మీటర్ల వస్రంపై తయారుచేసిన ఈ నమూనా విశేషంగా ఆకట్టుకుంటోంది. దీని తయారీకి హరి ప్రసాద్ వారం రోజులపాటు శ్రమించారు. తనకు అవకాశం లభిస్తే ఈ అరుదైన వస్త్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేయనున్నట్లు చెప్పారు.

Updated On 9 Sep 2023 11:38 AM GMT
somu

somu

Next Story