Gaddar విధాత‌: ప్రజాగాయకుడు గద్దర్‌ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ అంటే భూమి సమస్య అని నాడు నిజాం భూమి అంతా నాదే అన్నాడు. ఇవ్వాళ కేసీఆర్‌ ధరణి పేరుతో భూములన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు. తెలంగాణలో భూమి పోరాటం మొదలైంది.. నీ పాలన అంతమైంది. భూమి దున్నినట్టలు నీ పాలనను దున్నేస్తామన్నాడు. తెలంగాణ కోసం పోరాడిన అమరుల ఉసురు తగిలి పోతావ్… అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Gaddar

విధాత‌: ప్రజాగాయకుడు గద్దర్‌ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ అంటే భూమి సమస్య అని నాడు నిజాం భూమి అంతా నాదే అన్నాడు. ఇవ్వాళ కేసీఆర్‌ ధరణి పేరుతో భూములన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు. తెలంగాణలో భూమి పోరాటం మొదలైంది.. నీ పాలన అంతమైంది. భూమి దున్నినట్టలు నీ పాలనను దున్నేస్తామన్నాడు.

తెలంగాణ కోసం పోరాడిన అమరుల ఉసురు తగిలి పోతావ్… అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రజాగాయకుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగుతున్నది. మార్చ్‌లో పాల్గొన్న గద్దర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య. నాడు 200 ఏళ్ళు పరిపాలించిన నిజాం రాజు భూమి అంతా నాదే అన్నాడు.

భూములన్నీ దేశ్ ముఖ్‌లకు, జమీందారులకు, పోలీసు పటేల్లకు, మాలి పటేల్లకు, కర్ణమోళ్లకు ఇచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ధరణి అని పేరు పెట్టి భూములన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 25 లక్షల భూమి కేసీఆర్ దగ్గర ఉన్నదని గద్దర్‌ ఆరోపించాడు.

మనకు అసైన్డ్ భూమి ఇచ్చి అమ్మొద్దు కొనొద్దు అన్నడు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థల కోసం పేదల నుండి లాక్కుంటున్నాడని ధ్వజమెత్తాడు. భూ సమస్యలు, భూ తగాదాలు పెట్టిన కేసీఆర్ గుర్తు పెట్టుకో… నీ పాలన కూల్చేస్తాం. ఇందులో నాది ప్రధాన పాత్ర. అందుకే ఎండలో తిరుగుతున్న అని హెచ్చరించాడు.
మా భూములు మాకే అని, మా నీళ్లు మాకే అని పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. రాష్ట్రం కోసం పోరాడి అమరుల ఉసురు తగిలిపోతావని ఘాటుగా విమర్శించారు.

గరీబోని భూమి గుంజుకొని కోట్లకు పడగలెత్తిన కంపెనీలకు ఇస్తున్నావు. బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గుర్తుంచుకోండి… భూమి జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించాడు. భూమి పోరాటం మొదలైంది. నీ పాలన అంతమైంది. దొరల అధీనంలో ఉన్న వేల ఎకరాల భూమిలో నాగండ్లు కడుతం.. భూమి దున్నినట్లు నీ పాలన దున్నేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated On 16 May 2023 3:09 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story