HomelatestGang Rape | బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. మధ్యప్రదేశ్‌లో ఘటన

Gang Rape | బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్.. మధ్యప్రదేశ్‌లో ఘటన

Gang Rape | Madhya Pradesh

భోపాల్: బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రాజ్ గఢ్ జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. సుమారు ఎనిమిది మంది వ్యక్తులు గురువారం రాత్రి బాధిత కుటంబం ఇంటిపై దౌర్జన్యానికి దిగారు.  మొత్తం అందరినీ క్రషర్ మెషిన్ బెల్టుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.

బాలిక అన్న, తండ్రి స్పృహ తప్పి పడిపోగా వారిలో కొంతమంది బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ ఘటనపై పోలీసులు తొలుత లైంగిక వేధింపుల కింద కేసు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.

24 గంటలలోపు నిందితుల్ని అరెస్టు చేయకపోతే ఆందోళనలకు దిగుతామని భీమ్ ఆర్మీ హెచ్చరించింది. ఎట్టకేలకు పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఉన్న స్థల వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular