Saturday, January 28, 2023
More
  Homelatestవైసీపీలోకి ‘గంటా’.. డిసెంబర్‌లో చేరిక

  వైసీపీలోకి ‘గంటా’.. డిసెంబర్‌లో చేరిక

  విధాత‌: రాజకీయాల్లో ఉంటే గింటే అధికార పార్టీలో ఉండాలి గానీ ప్రతిపక్ష పార్టీలో ఉండరాదన్నగొప్ప పాలసీ పెట్టుకున్న నాయకుడు గంటా శ్రీనివాసరావు త్వరలో మళ్లీ పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచిన శ్రీనివాసరావు ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా, ఆ తరువాత వారంతా చిరంజీవితో కలిసి కాంగ్రెస్ లో చేరారు.

  లక్కీగా అక్కడ కూడా 2009-14 మధ్య మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కథ ముగిశాక మళ్లీ టీడీపీలో చేరారు. భీమిలి నుంచి గెలిచాక 2014-19 మధ్య మళ్లీ విద్య శాఖ మంత్రిగా ప్రజా సేవలో తరించారు. తరువాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినా ఆయన మాత్రం విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అలా ప్రతిపక్షంలో ఉండడం ఆయన పాలసీకి విరుద్ధం కావడంతో గత నాలుగేళ్లుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

  జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ వచ్చేస్తాను.. వచ్చేస్తాను అంటూ సిగ్నల్స్ ఇస్తున్నాఅక్కడున్నది జగన్ కాబట్టి వెంటనే ఊ అని రమ్మనకుండా.. వద్దని చెప్పకుండా ఇన్నాళ్లూ లాగ్ చేస్తూ వచ్చారు. ఇక మళ్ళీ 2024 ఎన్నికల వేడి మొదలవడంతో గంటా మళ్లీ నిద్ర లేచారు. డిసెంబర్ మొదట్లో తన పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని ఆ సందర్భంగా వైస్సార్సీపీలో చేరుతారని అంటున్నారు.

  టీడీపీ హయాంలో బోలెడంత భూ కుంభకోణాలు జరిగాయని ఆనాడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బోలెడంత యాగీ చేసింది. గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఏకంగా ప్రభుత్వ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి కోట్లలో లోన్లు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు చేసింది. దీనిమీద ఏకంగా ప్రత్యేక దర్యాప్తు టీమ్(సిట్) వేశారు. దానిలో గంటా.. ఇంకొంతమంది పేర్లు కూడా తేలాయని అన్నారు. మొత్తానికి ఆ సిట్ నివేదిక ఏమైందో తెలియలేదు.

  ఆరోజుల్లోనే గంటా అరాచకాల‌ మీద ఏకంగా సొంత పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు సైతం ధ్వజమెత్తారు. పార్టీ పెద్దల సమక్షంలోనే గంటాను అవకాశవాదిగా పేర్కొంటూ కామెంట్లు చేసేవారు. అలాంటి గంటా ఇప్పుడు ఏమంత సుద్ద‌పూస అని వైసీపీలోకి తీసుకుంటున్నారో తెలియడం లేదని దిగువ స్థాయి కార్యకర్తలు వాపోతున్నారు.

  అప్పట్లో ఏ గంటా మీద పోరాటం చేశామో ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే మళ్లీ ఆయన కింద పని చేయాల్సి వస్తుందని మథనపడుతున్నారు. గంటా చేరుతున్నారు కాబట్టి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, అంత నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు చేరతారని అనుకుంటున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular