- గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం
విధాత: కార్పొరేట్, కెరీర్ ఓరియెంటెడ్ పొలిటీషియన్ గంట శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తేరే వేరు.. ఆయన ఎత్తులు, స్టెప్పులు అన్నీ విచిత్రంగా ఉంటాయి. నిత్యం అధికార పార్టీలో ఉండాలన్నది ఆయన పాలసీ. ప్రతిపక్షంలో ఉండడం అనేది రాజకీయం కాదనేది ఆయన అభిప్రాయం అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో ఉంటూ మంత్రిగా కొనసాగే ఆయన తీరు చాలామందికి నచ్చదు.
కానీ ఆయన మాత్రం తన స్టయిల్ మార్చుకోరు.. కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. వైఎస్సార్సీపి (YSRCP) లోకి వెళ్తానని ఆయన చూస్తున్నా ఎందుకనో మరి కుదరడం లేదు. ఈమధ్య చాన్నాళ్లుగా టీపీసీ(TDP)లోనే ఉంటున్న.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు విశాఖ (Visakha) వచ్చిననాడు కూడా అయన కలవలేదు. పార్టీ మహానాడుకు కూడా ఎటెండ్ కాలేదు. ఇక ఆయన జనసేన వైపు వెళ్తారని ఊహలూ వచ్చాయి.
కానీ ఆయన సడన్ గా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎన్నిక (MLC Graduates Election)ల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసారు. ఉత్తరాంధ్ర టీడీసీ అభ్యర్థి చిరంజీవి కోసం అయన ప్రచారం చేసారు. చాలా రోజుల తరువాత ఆయన టీడీసీ కండువా వేసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటి ఫలితం ఇవ్వాలని, గుణపాఠం చెప్పాలని గంటా కోరుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ప్రచారం చేయలేదు. పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన స్పందించలేదు.
అపుడు ఎక్కడ కనిపించని గంటా ఇపుడు మాత్రం వైసీపీకి గుణపాఠం చెప్పాలని కోరడం గమనార్హం. ఇన్నాళ్లూ ఈయన ఎక్కడ దాక్కున్నారు… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ హుషార్ ఏమిటి..ఈ డైలాగ్స్ ఏమిటి అని కార్యకర్తలు కూడా ఆశ్చర్యపడుతున్నారు. పోన్లే ఏదోలా మళ్ళీ గురుడు లైన్లోకి వచ్చాడు అని కొందరు సంబర పడుతున్నారు.