Flights | లండన్ విమానాశ్రయంలో ఘటన వాతావరణం ప్రతికూలంగా మారడం వల్లనో లేదా భద్రతా పరమైన కారణాలతోనో ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి ఫ్లైట్లను మళ్లిస్తాం. కానీ సిబ్బంది లేక విమానాలను నిలిపివేసి, కొన్నింటిని దారి మళ్లించిన విచిత్ర ఘటన లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో సిబ్బంది తగినంతగా లేకపోవడంతో డజనుకుపైగా విమానాల ప్రయాణాలు షెడ్యూల్ ప్రకారం జరగలేదు. కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్నింటిని ఏకంగా క్యాన్సిల్ చేసేశారు. […]

Flights |
లండన్ విమానాశ్రయంలో ఘటన
వాతావరణం ప్రతికూలంగా మారడం వల్లనో లేదా భద్రతా పరమైన కారణాలతోనో ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి ఫ్లైట్లను మళ్లిస్తాం. కానీ సిబ్బంది లేక విమానాలను నిలిపివేసి, కొన్నింటిని దారి మళ్లించిన విచిత్ర ఘటన లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో సిబ్బంది తగినంతగా లేకపోవడంతో డజనుకుపైగా విమానాల ప్రయాణాలు షెడ్యూల్ ప్రకారం జరగలేదు. కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్నింటిని ఏకంగా క్యాన్సిల్ చేసేశారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 22 సర్వీసులు నిలిచి పోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం.. 376 విమానాల ల్యాండింగ్ ఆలస్యం కాగా.. 252 విమానాల టేకాఫ్ షెడ్యూల్ ప్రకారం జరగలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ పేర్కొంది.
ప్రయాణికులు వీలైనంత తక్కువ ఇబ్బందులతో తమ ప్రయాణాన్ని సాగించేలా ఎయిర్‌పోర్ట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. మరోవైపు సిబ్బందిని పెంచుతూ వస్తున్నామని గాట్విక్ విమానాశ్రయం తన ప్రకటనలో పేర్కొంది.
