Tuesday, January 31, 2023
More
    Homelatestహీరోగా గెటప్ శీను.. అప్పుడే లిప్ లాక్

    హీరోగా గెటప్ శీను.. అప్పుడే లిప్ లాక్

    విధాత: మొత్తానికి ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ షో ఎందరో టాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రేక్షకులకు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కొత్త టాలెంట్ కు ఈ షో ఓ వేదికగా మారిందండంలో సందేహం లేదు. ఇప్పటికే అనసూయ, రేష్మి గౌతమ్ వంటి వారు ఎంతగానో పాపులర్ అయ్యారు. ఇక జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ ఇటీవలనే గాలోడు చిత్రంతో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు.

    బిలో యావరేజ్ టాక్ వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. దాంతో సరైన కంటెంట్ తో సుడిగాలి సుదీర్ తో సినిమా చేస్తే 20 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే సుడిగాలి సుదీర్ స్టార్ డైరెక్టర్ అయిన పరశురాంతో ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

    ఇక ప్రస్తుతం గెటప్ శీను వంతు వచ్చింది. జబర్దస్త్ సహా పలు సినిమాలలో గెటప్ శీను సందడి చేస్తున్నాడు. జాంబిరెడ్డి సహా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలను, కామెడీ పాత్రలలో చేస్తూ అలరిస్తున్నాడు. ఇప్పుడు గెటప్ శీను హీరోగా మారాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం రాజు యాదవ్. సూడో హీరోయిజం జోనర్ లో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం.

    గెటప్ శీను పాటలు, ఫైట్స్ తో ఊద‌ర‌గొట్టాల‌ని కాకుండా స్టోరీ బేస్డ్ మూవీలో నటించాడనిపిస్తోంది. మంచి లవ్ కామెడీతో పాటు ఎమోషనల్ యాంగిల్ కూడా మనకు కనిపిస్తోంది. ఏది ఏం జరిగినా మనం జీవితాంతం నవ్వుతూనే ఉండాలని ఎంజాయ్ చేస్తూ ఉండాలని పాయింటు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

    ఇక ఇందులో గెటప్ శీనుకు హీరోయిన్తో లిప్ లాక్ సీన్ ఉండ‌టం విశేషం. దాంతో ఈ లిప్ లాక్ సీన్ నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తానికి గెటప్ శీను త‌న‌లోని నటుడిని మరో కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమాగా రాజు యాదవ్ ను చెప్పుకోవచ్చు. కాగా ఈ టీజర్ కు ప్రముఖ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ అందించడం విశేషం.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular