విధాత: దెయ్యం.. ఆ పేరు వినగానే శరీరంలో ఏదో ఒక తెలియని ఆందోళన ఏర్పడుతుంది. భయం పుట్టుకొస్తుంది. ఇక నిద్రలో ఉన్నప్పుడు దెయ్యం కలలు వస్తే.. హఠాత్తుగా నిద్రలో నుంచి లేస్తాం. లేదంటే గట్టిగా కేకలు వేస్తాం.. మరి అలాంటి దెయ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే వణికిపోవడం ఖాయం. ప్రస్తుతం ఓ దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ అలీఘర్‌లోని బన్నాదేవి పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ రాజేంద్రనగర్‌లోని ఓ ఇంటి ముందు ఇటీవల ఓ […]

విధాత: దెయ్యం.. ఆ పేరు వినగానే శరీరంలో ఏదో ఒక తెలియని ఆందోళన ఏర్పడుతుంది. భయం పుట్టుకొస్తుంది. ఇక నిద్రలో ఉన్నప్పుడు దెయ్యం కలలు వస్తే.. హఠాత్తుగా నిద్రలో నుంచి లేస్తాం. లేదంటే గట్టిగా కేకలు వేస్తాం.. మరి అలాంటి దెయ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే వణికిపోవడం ఖాయం. ప్రస్తుతం ఓ దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ అలీఘర్‌లోని బన్నాదేవి పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ రాజేంద్రనగర్‌లోని ఓ ఇంటి ముందు ఇటీవల ఓ అర్ధరాత్రి దెయ్యం ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఓ మహిళ మాదిరిగా ఆ దెయ్యం వీడియోలో కనిపిస్తుంది. ఇంటి ముందు కనిపించిన దెయ్యం.. రోడ్డువైపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..
