HomelatestGill vs Arjun Tendulkar | బావ బామ్మర్ధుల పోరు.. మధ్యలో బలైన సారా టెండుల్కర్‌

Gill vs Arjun Tendulkar | బావ బామ్మర్ధుల పోరు.. మధ్యలో బలైన సారా టెండుల్కర్‌

Gill vs Arjun Tendulkar |

విధాత‌: ఐపీఎల్‌ 2023లో భాగంగా మంగళవారం గుజరాత్‌ టైటాన్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. ఐపీఎల్‌లో అభిమానులకు వాళ్ల ఫేవరేట్‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను స్టేడియంతో ప్రపంచ వీక్షకులు ఆ ఇద్దరి ఆటగాళ్ల వైపు మాత్రమే చూసింది. వాళ్లిద్దరు ఎవరో కాదు. ఒకరు బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కాగా మరొకరు అర్జున్‌ టెండుల్కర్‌.

ఈ సారి ఐపీలో అరంగేట్రం చేసిన సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌పై అందరిలోనూ ఆంచనాలు నెలకొన్నాయి.. అర్జున్‌ ఆల్‌ రౌండర్‌ అయినా బౌలింగ్‌లో రాణించి ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాట్స్‌మెన్‌ వృర్ధిమాన్‌ సాహాను మొదట్లోనే పెవీలియన్‌కు పంపాడు.

ఇక శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌కు వచ్చినా, ఫీల్డింగ్‌కు వచ్చినా ‘సారా సారా’ అంటూ స్టేడియమంతా అభిమానుల అరుపులతో మారు మోగుతుంటుంది. ఎందుకంటే గిల్‌ సచిన్‌ కూతురు, అర్జున్‌ సోదరి అయిన సారా టెండుల్కర్‌తో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.

ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్‌ శుభ్‌మన్‌కు బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? ఇంకా రెట్టించిన ఉత్సాహంతో సారా సారా అంటూ కేకలు వేశారు. గిల్‌ -అర్జున్‌ మొదటి రెండు ఓవర్లు తలపడ్డారు. అర్జున్‌ వేసిన బంతికి గిల్‌ సింగిల్‌ తీశారు. తర్వాత అర్జున్‌కు మళ్లీ బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. నెటిజన్లు మాత్రం ఇంకా కావాలి అంటూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఈ సందర్భంగా ఈ మ్యాచ్లో శుభ్‌మన్‌ గిల్‌కు అర్జున్‌ బౌలింగ్‌ వేస్తున్న క్లిప్పులను, గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న సారా ఫొటోలతో మీమ్స్ చేస్తు పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ రీల్స్, మీమ్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెడింగ్‌ మారాయి.

శుభ్‌మన్‌ గిల్‌, సారాలు ఇద్దరు లవ్‌లో ఉన్నారో తెలియదు. కానీ ఐపీఎల్లో మాత్రం ఈ దృశ్యాలతో మీమ్స్‌, రీల్స్‌ పోస్టు చేస్తూ సోషల్‌ మీడియాను స్పైసీగా మార్చారు.

శుబ్‌మన్‌ గిల్‌: సచిన్‌ అల్లుడంటే ఆ రేంజ్‌ ఉంటది!

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular