విధాత, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా గిరిధర్ అరమణే పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌తో గిరిధర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిధర్.. ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తొలుత కొత్త సీఎస్‌గా జవహార్ రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.