3 గంటలు ఆటోలోనే బాలికపై సామూహిక అత్యాచారం..
విధాత: ఓ బాలికపై ఇద్దరు క్రూర మృగాలు విరుచుకుపడ్డారు. ఆటో వెళ్తున్న ఆమెపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ 18 ఏండ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి బయల్దేరేందుకు సిద్ధమైంది. ఇక ఆటో మాట్లాడుకుని ఇంటికి వస్తోంది. తనకు తెలిసిన దారిలో కాకుండా, వేరే మార్గంలో […]

విధాత: ఓ బాలికపై ఇద్దరు క్రూర మృగాలు విరుచుకుపడ్డారు. ఆటో వెళ్తున్న ఆమెపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ 18 ఏండ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి బయల్దేరేందుకు సిద్ధమైంది. ఇక ఆటో మాట్లాడుకుని ఇంటికి వస్తోంది. తనకు తెలిసిన దారిలో కాకుండా, వేరే మార్గంలో ఆటోను తీసుకెళ్లారు. అప్పటికే ఆ బాలిక అరిచింది.
ఈ మార్గంలో వద్దు.. వేరే దారిలో తీసుకెళ్లాలని మొత్తుకున్నప్పటికీ ఆ దుండగులు వినిపించుకోలేదు. ఆ ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి మార్గమధ్యలోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 3 గంటల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత బాధితురాలిని తీవ్రంగా కొట్టి, ఆమె ఫోన్‌ను దొంగిలించారు. ఇక రోడ్డుపై ఆమెను వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోసుకుని వెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
