High Court | వరదలపై ముందస్తు చర్యలు చేపట్టండి తదుపరి విచారణ డిసెంబర్ 18న విధాత, హైదరాబాద్: వరద నష్టాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ర్ట సర్కార్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూలై, ఆగస్టులో వర్షాలు, వదరల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలంటూ చెరుకు సుధాకర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. భారీ వర్షాలు, వరదల […]

High Court |
- వరదలపై ముందస్తు చర్యలు చేపట్టండి
- తదుపరి విచారణ డిసెంబర్ 18న
విధాత, హైదరాబాద్: వరద నష్టాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ర్ట సర్కార్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూలై, ఆగస్టులో వర్షాలు, వదరల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలంటూ చెరుకు సుధాకర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది.
భారీ వర్షాలు, వరదల సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన గట్టం మహాలక్ష్మి కోసం గాలించి ఆచూకీ గుర్తించాలని సూచనలు చేసింది. ఆమె మరణించినట్లు తెలితే బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలని ఆదేశించింది. వరదల్లో 47 మంది మృతి చెందారని, వారిలో 24 మందికి పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హరేంద్ర ప్రసాద్ ధర్మాసనానికి తెలిపారు.
వరదల సమయంలో 192 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, 20,387 మందికి తాత్కాలిక నివాసం, ఆవాసం, వైద్యసేవలు అందించినట్టు వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన మహాలక్ష్మి ఆచూకీ లభించలేదన్నారు. వర్షాలు, వరదల విపత్తు నుంచి అమాయక ప్రజలకు రక్షణ కల్పించాలని పిటిషనర్ తరుఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.
గత 3 సంవత్సరాల నుంచి ఇలాంటి విపత్తు కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆస్థి, ప్రాణ నష్టం కూడా చాలానే జరిగిందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ముందస్తు రక్షణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. వారంత ఎప్పడు ఏమీ జరుగుతుందోనని భయంతోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
గోదావరి, కాళేశ్వరం ప్రాజెక్డులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వర్షాలు వరదల సమయంలో ప్రజల ప్రాణాలతోపాటు పశువులు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతున్నాయని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు నీటిని ఎత్తిపోసి ఆకస్మికంగా నీటిని కిందికి విడుదల చేయడంతో ములుగు, భద్రాద్రి జిల్లాలతోపాటు దిగువ ప్రాంతాలు మునిగిపోతున్నాయని, దాని కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నదని తెలిపారు.
దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని ధర్మాసనాన్ని కోరారు. అదేవిధంగా 111 జీవో అమలు చేయకపోవడంతో హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగి ఇండ్లలోకి వరదల నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి, ఎన్ని కుటుంబాలకు ఆర్థికసాయం తోపాటు నివాసలు ఏర్పాటుచేశారు.. తదితర అంశాలపై పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
