విధాత: తెలంగాణలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యం బాటిళ్లను నల్లగొండ ఎక్సైజ్ పోలీసులు జిల్లా సరిహద్దుల్లోని మిర్యాలగూడ చెక్ పోస్ట్ వద్ద శనివారం చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు.
నల్గొండ ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంబు ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గోవా నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం NDP (Non duty paid) 168 బాటిళ్లు మిర్యాలగూడలోని అద్దంకి బైపాస్ వద్ద వాహనాల తనిఖీలలో పట్టుబడినట్లు తెలిపారు.
దామరచర్ల మండలం పుట్లగడ్డ తండాకు చెందిన రూపావత్ శ్రీరామ్, సురేష్ AP 28 AZ 0717 కారులో 168 మద్యం బాటిళ్లను తీసుకొస్తూ పట్టుబడ్డారని, ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి, గోవా మద్యం, కారును సీజ్ చేసి వారిని రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు.
దాడుల్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిషన్ నాయక్, సీఐలు భరత్ భూషణ్, నాగార్జునరెడ్డి రాఘవీణ, ఎస్ ఐలు శివకృష్ణ, రాఘవేందర్, సిబ్బంది అప్సర్ అలీ, ఆయుబ్, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, నాగరాజు, బ్రహ్మం, రమేష్, వసంత, చందన పాల్గొన్నారు