PM Modi న్యూఢిల్లీ : మహిళా కోటా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇది మనందరికీ గర్వకారణమైన సందర్భమని అన్నారు. మహిళా బిల్లుపై అనేక సంవత్సరాలుగా పార్లమెంటు చర్చించిదని పేర్కొన్నారు. 1996లో మొదటిసారి బిల్లు ప్రవేశపెట్టారని, వాజ్‌పేయి హయాలో పలు సందర్భాల్లో బిల్లు ఆమోదానికి కృషి జరిగిందని చెప్పారు. కానీ.. తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల బిల్లు ఆమోదం పొందలేదని తెలిపారు. ‘బహుశా ఈ పవిత్రమైన […]

PM Modi
న్యూఢిల్లీ : మహిళా కోటా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇది మనందరికీ గర్వకారణమైన సందర్భమని అన్నారు. మహిళా బిల్లుపై అనేక సంవత్సరాలుగా పార్లమెంటు చర్చించిదని పేర్కొన్నారు. 1996లో మొదటిసారి బిల్లు ప్రవేశపెట్టారని, వాజ్‌పేయి హయాలో పలు సందర్భాల్లో బిల్లు ఆమోదానికి కృషి జరిగిందని చెప్పారు.
కానీ.. తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల బిల్లు ఆమోదం పొందలేదని తెలిపారు. ‘బహుశా ఈ పవిత్రమైన కార్యం నిర్వహించడానికి దేవుడే నన్ను ఎంచుకున్నాడేమో’ అని మోదీ వ్యాఖ్యానించారు. సభలో పక్షాలన్నీ ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలని కోరారు.
