ఆరోగ్య విధాత: శ్వాస క్రియ, జీర్ణక్రియ, ప్రత్యుత్పత్తితో పాటు శరీరం మరో ముఖ్యమైన జీవక్రియనను కూడా తప్పక నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే విసర్జన క్రియ. మల, మూత్ర విసర్జనల్లో మూత్ర విసర్జన ప్రక్రియ శరీరం లోపల నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మూత్ర విసర్జన వ్యవస్థలోని కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు ఇవి నిరంతరాయంగా రక్తాన్ని వడకడుతూ మలినాల్ని వేచు చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మానవుడు సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. […]

ఆరోగ్య విధాత: శ్వాస క్రియ, జీర్ణక్రియ, ప్రత్యుత్పత్తితో పాటు శరీరం మరో ముఖ్యమైన జీవక్రియనను కూడా తప్పక నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే విసర్జన క్రియ. మల, మూత్ర విసర్జనల్లో మూత్ర విసర్జన ప్రక్రియ శరీరం లోపల నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మూత్ర విసర్జన వ్యవస్థలోని కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు ఇవి నిరంతరాయంగా రక్తాన్ని వడకడుతూ మలినాల్ని వేచు చేస్తూనే ఉంటుంది.

ఆరోగ్యవంతుడైన మానవుడు సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. అయితే అందరిలో ఈ జీవక్రియ ఒకే మాదిరిగా ఉండదు. అయితే మామూలుగా వెళ్లేదాని కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఒక సారి డాక్టర్ సలహా తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

విసర్జన క్రియ.. జీవ క్రియల్లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. శరీరంలో చేరిన మలినాలు రక్తం ద్వారా శరీరంలో వ్యాపించకుండా ఎప్పటికప్పుడు రక్తాన్ని వడకట్టి తొలగించే ప్రక్రియ. ఈ ప్రహసనంలో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం అది రకరకా అనారోగ్యాలకు సూచన కావచ్చు, లేదా ఏదైనా పెద్ద ప్రమాదం పొంచి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి.

అందుకే తప్పనిసరిగా మూత్ర విసర్జన ఎన్ని సార్లు చేస్తున్నాం? వాసన, రంగులో వచ్చిన మార్పులను గమనించుకోవడం తప్పనిసరి. మూత్ర విసర్జనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఒక రోజులో పది సార్లు మూత్ర విజర్జనకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందంటే ఒక సారి తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయ్యాల్సి వస్తుందంటే కచ్చితంగా ఆరోగ్యంలో ఏదో తేడా చేసినట్టే.

డయాబెటిస్

రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినపుడు కిడ్నీలు మరింత కష్టపడి రక్తం నుంచి ఎక్కవైన గ్లూకోజ్‌ను వడ కట్టాల్సి వస్తుంది. ఆహారంలో చక్కెరలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన కు వెళ్తున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించి చూసుకోవాలి. వీరు టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారేమో నిర్ధారించుకోవాలి. అంతేకాదు మూత్రం వాసన కూడా మారుతుంది. కుళ్ళిన పండు వంటి తియ్యటి వాసనతో ఉంటుంది.

ప్రొస్టేట్ పరిమాణం పెరగడం

పురుషుల్లో కనిపించే సమస్య ఇది. ప్రొస్టేట్ పురుషుల్లో బ్లాడర్‌కు దగ్గరగా ఉండే గ్రంథి. 50 వయస్సు దాటిన తర్వాత చాలా మంది పురుషుల్లో ఈ గ్రంథి పరిమాణంలో పెరుగుతుంది. అందువల్ల బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తరచుగా మూత్రవిసర్జన చెయ్యాల్సి వస్తుంది. అంతేకాదు మూత్ర విసర్జనలో సమస్యలు కూడా వస్తాయి.

బ్లాడర్ క్యాన్సర్

బ్లాడర్ అనేది మూత్ర విసర్జన వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన అవయవం. దీనిలో ఏర్పడే కంతుల వల్ల మూత్ర విసర్జన మీద ప్రభావం పడుతుంది. సాదారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాదు ఇలాంటి పరిస్థితిలో విసర్జనలో నొప్పి కూడా ఉంటుంది. బ్లాడర్‌లో మూత్రం నిండి లేకపోయినా సూది గుచ్చుతున్నటువంటి నొప్పి నిరంతరం ఉంటుంది.

పక్షవాతం

శరీరంలో అత్యంత ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించే అవయవం మెదడు. మెదడుకు అవసరమైన ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. ఇలా మెదడుకు రక్తం తీసుకువెళ్లే రక్త నాళం చిట్లిపోవడం లేదా దానిలో అడ్డంకులు ఏర్పడడం వల్ల పక్షవాతం వస్తుంది. ఇలా జరిగినపుడు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా దెబ్బ తిన్నప్పుడు శరీరంలోని ఏ అవయవం మీద దాని ప్రభావం ఉంటుందో చెప్పటం కష్టం. బ్లాడర్ ను నియంత్రించే నాడులు ఇలాంటి ప్రభావానికి లోనైనపుడు కూడా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు.

సెక్సువల్లీ ట్రాన్స్మీటెడ్ ఇన్ఫెక్షన్

క్లామిడియా, గనేరియా అనేవి చాలా తరచుగా కనిపించే సెక్సువల్లీ ట్రాన్సిమిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇలా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ వల్ల మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటుంది. మూత్రం కూడా చిక్కబడినట్టుగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది కనిపిస్తే తప్పని సరిగా డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో బాక్టీరియా మూత్ర నాళంలో ప్రవేశించి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అంతేకాదు మూత్ర విసర్జనలో మంటగా ఉండడం, మూత్రంలో రక్తం అవశేషాలు కూడా కనిపిస్తాయి. దీనికి కూడా సరైన చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలం పాటు మనల్ని వేధించే ప్రమాదం ఉంటుంది.

ప్రెగ్నెన్సీ

గర్భాశయంలో పిండం ఎదిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల బ్లాడర్‌లో మూత్రం నిల్వ చేసే సమార్థ్యం తగ్గతుంది. ఫలితంగా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కూడా కొంచెం మూత్రవిసర్జన పెరుగుతుంది. ఇందుకు కారణం ప్రొజెస్టిరాన్ అనే హర్మోన్.

Updated On 5 Nov 2022 12:03 PM GMT
krs

krs

Next Story