Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్పంగా ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.150 తగ్గి తులానికి రూ.55,850 పలుకుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడిపై రూ.160 తగ్గి తులానికి రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లోనే ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేలకు తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,840కి తగ్గింది. చెన్నైలో […]

Gold Rate |

బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్పంగా ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.150 తగ్గి తులానికి రూ.55,850 పలుకుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడిపై రూ.160 తగ్గి తులానికి రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది.

దేశంలోని వివిధ నగరాల్లోనే ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60వేలకు తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,840కి తగ్గింది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,110 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,840 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

అలాగే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండిపై రూ.500 దిగి రాగా.. కిలోకు రూ.73,500 వద్ద పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77వేలకు తగ్గింది.

Updated On 10 Sep 2023 7:32 AM GMT
cm

cm

Next Story