Gold Rate | దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గి రూ.55,800కి చేరింది.
24 క్యారెట్ల బంగారం రూ.490 పతనమై.. రూ.61,360 వద్ద కొనసాగుతున్నది. మరో వైపు వెండి ధరలు సైతం శుక్రవారం భారీగా తగ్గుముఖం పట్టాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,020 వద్ద ట్రేడవుతున్నది.
ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,870 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,360 పలుకుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,870 వద్ద ట్రేడవుతున్నది. విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు కిలో వెండిపై ఏకంగా రూ.1000 పతనమై.. రూ.74,050కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.76,500 పలుకుతున్నది.