Gold Rate |
వినియోగదారులను పసిడి ధరలు భయపెడుతున్నాయి. రోజు రోజుకు పసడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం కొనాలనుకునే సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. గత మూడురోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.1500 పెరగడంతో పసిడి ప్రియులు ఆందోళనకు గురవుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, బ్యాంకింగ్ సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో అందరూ బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా పసడి ధరలు పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2017.30 డాలర్లుగా ఉన్నది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.68 డాలర్ల మార్క్‌ను దాటింది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చినప్పుడు ప్రస్తుతం రూ.81.745 మార్క్ వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్‌లో తులం బంగారం ఎంత ఉందంటే..?
హైదరాబాద్‌లో పసడి ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. శనివారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.200 పెరిగి రూ.57,200కు చేరింది. 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.62,400వద్ద కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. రూ.62,550 పలుకుతోంది. మరో వైపు వెండి ధర సైతం బంగారంతో పోటీపడుతున్నది.
కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.900 మేర పెరిగి రూ.83,700కి చేరింది. గత నాలుగు రోజుల్లోనే వెండి రూ.3500 వరకు పెరిగింది. ఢిల్లీలో రూ.78,250కి చేరింది.
అయితే, ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు అధికంగా ఉంటాయి. దీనికి స్థానికంగా ఉండే ట్యాక్స్‌లు, ఇతర చార్జీల కారణంగా తేడాలుంటాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు.