Gold Rate | బంగారం ధరలు మహిళలకు షాక్ ఇచ్చాయి. గురువారం మళ్లీ ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 పెరిగి రూ.56,250కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధరపై రూ.260 పెరిగి రూ.61,360కి చేరింది. మరో వైపు వెండి ధరలు స్వల్పం తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం 22 క్యారెట్ల బంగారం రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,510కి పెరిగింది. బెంగళూరులో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం రూ.56,300కి చేరగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,410 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,800కి పెరిగింది.
ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.56,250 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,360కి చేరింది. హైదరాబాద్‍లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,360 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఓ వైపు బంగారం ధరలు పైపైకి కదులుతుండగా.. వెండి ధర పతనమవుతున్నది. కిలో వెండిపై రూ.450 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500కి తగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా రుణ గరిష్ఠ పరిమితిపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దాంతో మార్కెట్‌లో బంగారం ధర ఊగిసలాడుతున్నది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1959 డాలర్ల వద్ద టేడ్రవుతున్నది.