HomelatestGold Rate | కొనుగోలుదారులకు రిలీఫ్‌.. రెండో రోజూ స్థిరంగా బంగారం ధరలు..!

Gold Rate | కొనుగోలుదారులకు రిలీఫ్‌.. రెండో రోజూ స్థిరంగా బంగారం ధరలు..!

Gold Rate |

మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దాంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయ్యింది. వరుసగా రెండో రోజూ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.

ప్రస్తుతం 22 గ్రాముల తులం బంగారం రూ.56,650, స్వచ్ఛమైన తులం బంగారం రూ.6,18,000 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి పుత్తడి రేటు రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,950 వద్ద కొనసాగుతున్నది.

ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.56,650, ఇక 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,800 పలుకుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,350 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,850 ధర పలుకుతున్నది.

ఇక హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ.56,650 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800 వద్ద కొనసాగుతున్నది.

ఏపీలో విజయవాడ, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి హైదరాబాద్‌లో రూ.78,500 ధర పలుకుతున్నది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular