Gold Rates | కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్‌నిచ్చాయి. నిన్నా మొన్నటి వరకు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.500 వరకు పెరిగి రూ.57వేలకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి రూ.540 పెరిగి రూ.62,180కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,330 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి […]

Gold Rates |

కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్‌నిచ్చాయి. నిన్నా మొన్నటి వరకు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.500 వరకు పెరిగి రూ.57వేలకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి రూ.540 పెరిగి రూ.62,180కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,330 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,180కి చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,730 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి రూ.57,050 వద్ద ట్రేడవుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,230 పలుకుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.57వేలకు చేరగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,180కి పెరిగింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం కూడా పెరిగింది. కిలోకు రూ.300 పెరిగి.. రూ.77,100 పలుకుతున్నది.

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82వేలకు చేరింది. ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి తదితర కారణాల కారణంగా బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Updated On 5 May 2023 2:01 AM GMT
Vineela

Vineela

Next Story