Gold Rates | వచ్చేవారం అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం కాబోతున్నది. ఈ భేటీపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో డాలర్‌ స్వల్పంగా పతనమైంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1949 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతున్నది. ఈ క్రమంలో దేశంలో పుత్తడి, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 పెరిగి.. తులానికి రూ.54,700 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై […]

Gold Rates |

వచ్చేవారం అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశం కాబోతున్నది. ఈ భేటీపై ఇన్వెస్టర్లు దృష్టిసారించడంతో డాలర్‌ స్వల్పంగా పతనమైంది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది.

ప్రస్తుతం ఔన్స్‌కు 1949 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతున్నది. ఈ క్రమంలో దేశంలో పుత్తడి, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 పెరిగి.. తులానికి రూ.54,700 పలుకుతున్నది.

ఇక 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220 పెరిగి.. రూ.59,670 పలుకుతున్నది. వెండి కిలోకు రూ.500 పెరిగింది. దేశంలోని వివిధ మార్కెట్లలో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.59,820 పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60వేలకు చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,670కి చేరింది.

gold storage at home

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,670కి పెరిగింది. కేరళలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,670 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,670 వద్ద కొనసాగుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి కిలోకు రూ.500 పెరిగింది. ప్రస్తుతం కిలోకు రూ.74వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.77,500 వద్ద ట్రేడవుతున్నది.

Updated On 16 Sep 2023 4:24 AM GMT
cm

cm

Next Story