Gold Rates | దేశంలో బంగారం ధరలు మరోసారి ఆదివారం పెరిగాయి. 22 గ్రాముల పసిడిపై రూ.200 పెరిగి.. రూ.54,900కి చేరింది. మరో వైపు 24 క్యారెట్ల ధరపై రూ.240 ఉండగా.. రూ.59,800కి పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,040 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,900కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,890కి చేరింది. చెన్నైలో చెన్నైలో 22క్యారెట్ల […]

Gold Rates |
దేశంలో బంగారం ధరలు మరోసారి ఆదివారం పెరిగాయి. 22 గ్రాముల పసిడిపై రూ.200 పెరిగి.. రూ.54,900కి చేరింది. మరో వైపు 24 క్యారెట్ల ధరపై రూ.240 ఉండగా.. రూ.59,800కి పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ధరలను పరిశీలిస్తే..
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,040 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,900కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,890కి చేరింది.
చెన్నైలో చెన్నైలో 22క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,320కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,890 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం మార్కెట్‌లో ఆదివారం భారీగా పెరిగాయి. కిలోకు రూ.700 పెరిగి రూ.74,700కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం కిలోకు రూ.78,200 వద్ద కొనసాగుతున్నది.
