Gold Rates |
వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా శనివారం పుత్తడి రేటు దిగివచ్చింది. వెండి సైతం అదే బాటలో నడుస్తున్నది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150 తగ్గి.. రూ.55,560కి చేరింది.
24 క్యారెట్ల తులం బంగారంపై రూ.160 తగ్గి రూ.60,870 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.55,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,860 వద్ద కొనసాగుతున్నది.
ముంబయిలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,710 పలుకుతున్నది. చెన్నైలో 22క్యారెట్ల స్వర్ణం రూ.56,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,150 వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,760 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,710 పలుకుతున్నది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం శనివారం తగ్గాయి. కిలో వెండిపై రూ.150 తగ్గి.. రూ.72,900కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.76,200 పలుకుతున్నది.