Pathan ఈమధ్య సౌత్ ఇండియా సినిమాల హవా దేశమంతా సాగుతోంది. సౌత్ ఇండియన్ చిత్రాలతో పోల్చుకుంటే బాలీవుడ్ చిత్రాలు బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. దక్షిణాదిన కరోనా నుంచి ప్రేక్షకులు కోలుకుని థియేటర్లకు క్యూ కడుతున్నారు. కానీ ఉత్తరాదిలో మాత్రం ఇంకా కరోనా తర్వాత మామూలు పరిస్థితులు నెలకొనలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తీసిన పలు భారీ చిత్రాలను ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బాద్షా, కింగ్ కాంగ్ షారుక్ నటించిన ప‌ఠాన్ చిత్రం ఈనెల […]

Pathan

ఈమధ్య సౌత్ ఇండియా సినిమాల హవా దేశమంతా సాగుతోంది. సౌత్ ఇండియన్ చిత్రాలతో పోల్చుకుంటే బాలీవుడ్ చిత్రాలు బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. దక్షిణాదిన కరోనా నుంచి ప్రేక్షకులు కోలుకుని థియేటర్లకు క్యూ కడుతున్నారు. కానీ ఉత్తరాదిలో మాత్రం ఇంకా కరోనా తర్వాత మామూలు పరిస్థితులు నెలకొనలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తీసిన పలు భారీ చిత్రాలను ఓటీటీలలో రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు.

ఇలాంటి సమయంలో బాలీవుడ్ బాద్షా, కింగ్ కాంగ్ షారుక్ నటించిన ప‌ఠాన్ చిత్రం ఈనెల 25న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమాపై బాలీవుడ్ జనాలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వ‌రుస పాన్ ఇండియా చిత్రాల దాడులతో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరిలాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

ఒక‌ప్పుడు సునాయాసంగా 100 కోట్లు దాటేసే బాలీవుడ్ హీరోలు ఈమధ్య వరుస డిజాస్టర్ చిత్రాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాంతో బాలీవుడ్ డీలా ప‌డిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు షారుక్ ప‌ఠాన్ చిత్రం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం రెండు రోజుల్లో 100 కోట్లు దాటేయడం ఖాయమని లెక్కలు బయటకు వస్తున్నాయి. చిత్రానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ చూస్తే బాలీవుడ్ కి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది.

హై వోల్టేజ్ కంటెంట్ కావడం యాక్షన్ ఎలిమెంట్స్ పవర్ఫుల్ గా ఉండడం దీపిక అందాలు ఆరబోయడం పఠాన్ చిత్రంపై మాస్ బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ తో పాటు ప‌లు నగరాలలో అడ్వాన్స్ బుకింగ్లలో ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది.

ముసలోడికి దసరా పండగ అంటే ఇదే!

ఈ సినిమాకు మొదటి రోజు 42 నుంచి 45 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రెండో రోజు 50 నుంచి 52 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా రెండు రోజుల్లో పఠాన్ 100 కోట్ల గ్రాస్ ని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పాజిటివ్ టాక్ వస్తే మొదటి అయిదు రోజుల్లోనే 200 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందనిటాక్ వినిపిస్తోంది. దీంతో పఠాన్ తో బాలీవుడ్కు మంచి రోజులు వస్తాయి అని అందరూ భావిస్తున్నారు. మోడీ సైతం సినిమాలను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ప్రకటించిన తర్వాత పఠాన్ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేసాయని అంటున్నారు.

కోల్‌కతా, హైదరాబాద్, ముంబై పూణె వంటి కీలక నగరాలలో ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కాగా ముంబై బెంగాల్లో భారీ స్పందన వస్తోంది. ఇక నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మిడిల్ ఈస్ట్ ఈస్ట్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి భారీ స్పందన వస్తున్నట్లు సమాచారం.

Updated On 23 Jan 2023 7:32 AM GMT
krs

krs

Next Story