iPhone 12 | ఆపిల్ అంటేనే ఆ క్రేజేవేరు. ఐఫోన్లలో 12 చాలా పాపులర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. గతంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేలో ఐఫోన్ 12 భారీగా కొనుగోలు చేశారు. ఇటీవల మార్కెట్‌లోకి ఐఫోన్ 15 విడుదలైంది. ఈ సందర్భంగా ఐఫోన్‌ను 12 డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మినీని సైతం అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. ఆపిల్ […]

iPhone 12 |
ఆపిల్ అంటేనే ఆ క్రేజేవేరు. ఐఫోన్లలో 12 చాలా పాపులర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. గతంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేలో ఐఫోన్ 12 భారీగా కొనుగోలు చేశారు. ఇటీవల మార్కెట్‌లోకి ఐఫోన్ 15 విడుదలైంది. ఈ సందర్భంగా ఐఫోన్‌ను 12 డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మినీని సైతం అధికారిక స్టోర్ నుంచి తొలగించింది.
ఆపిల్ లాంచ్ చేసిన చివరి మినీ మోడల్ ఇదే కావడం విశేషం. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీ చాలా క్రేజ్ ఉండేది. వీటిని తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌కు లభిస్తున్నాయి. తొలిసారిగా అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్ కార్టులో ఐఫోన్ 12 ధర రూ.49,999 ఉండగా.. ఎక్స్ఛేంజ్ సదుపాయం ఉన్నది. గరిష్ఠంగా రూ.30,600 వరకు ఎక్స్చేంజ్ వర్తించనున్నది. దాంతో ఐఫోన్ 12 19,399 వరకు రానున్నది. అదే సమయలో హెచ్‌డీఎఫ్‌డీ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్ లభించనున్నది.
అయితే, మీరు మార్చుకునే ఫోన్‌ను బట్టి ఐఫోన్ ధర ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 12లో మంచి ఫీచర్లే ఉన్నాయి. 6.1 అంగుళా సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉండగా.. ఏ 14 బయోనిక్ చిప్, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్,సిరామిక్ షీల్డ్ తదితర ఫీచర్లున్నాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్‌సైడ్.. 12 మెగా పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా.. ఫ్రంట్ కెమెరా 12 మెగా పిక్సెల్ ఉంది. నైట్ మోడ్, 4కే డాల్‌బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్. వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఐఫోన్ 15ను యాపిల్ కంపెనీ ఇటీవల కాలిఫోర్నియాలోని వండర్‌లస్ట్ ఈవెంట్‌లో విడుదల చేసింది. ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
