HomelatestTruecaller | యూజర్లకు శుభవార్త చెప్పిన ట్రూకాలర్‌..! త్వరలో వాట్సాప్‌లోనూ సర్వీసులు..!

Truecaller | యూజర్లకు శుభవార్త చెప్పిన ట్రూకాలర్‌..! త్వరలో వాట్సాప్‌లోనూ సర్వీసులు..!

Truecaller |

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ట్రూకాలర్‌ శుభవార్త చెప్పింది. త్వరలో వాట్సాప్‌కు సైతం ట్రూ కాలర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఏదైనా గుర్తు తెలియని నంబర్‌ నుంచి వస్తే ఆ నంబర్‌కు సంబంధించి ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ను చూపిస్తుంది.

ఇప్పటివరకు సిమ్ నెట్‍వర్క్‌కు వచ్చే కాల్స్‌ వరకు ఈ సదుపాయం ఉన్నది. త్వరలోనే వాట్సాప్‌కు సైతం జోడించనున్నట్లు తేనున్నట్లు ప్రకటించింది. ఈ నెల చివరి నాటికి వాట్సాప్‌ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్రూ కాలర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలాన్‌ మమేడీ ప్రకటించారు.

వాట్సాప్‌కు ఇంటర్నేషనల్‌ కాల్స్‌..

ఇటీవల వాట్సాప్‌ యూజర్లకు ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన కోడ్స్‌తో భారీగా కాల్స్‌ వస్తున్నట్లు ఇటీవల యూజర్లు పేర్కొంటున్నారు. వీటిలో ఎక్కువగా స్పామ్స్‌ కాల్సే ఉంటున్నాయి. యూజర్లను మోసం చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ యూజర్లకు ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా +60 (మలేషియా ), +251 (ఇథియోపియా), +62 (ఇండోనేషియా ), +254 (కెన్యా), +84 (వియత్నాం) తదితర దేశాల నంబర్ల నుంచి యూజర్స్‌కు ఫోన్స్‌ వస్తున్నాయి.

సైబర్‌ నేరగాళ్లు ఇంటర్నేషనల్‌ నంబర్లను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత డేటా, క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డులను ఉపయోగించి సైబల్‌ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ కాల్స్‌ తరహాలోనే ట్రూ కాలర్‌ వాట్సాప్‌కు సైతం అందుబాటులోకి వస్తే ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ను సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి. కాల్స్‌ రిసీవ్‌ చేసుకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. గుర్తు తెలియని ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్‌ చేయకూడదని, ఎలాంటి వివరాలు చెప్పకూడదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న సైబర్‌ మోసాలు..

రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. టెలీమార్కెటింగ్‌, స్కామింగ్‌ లాంటి స్పామ్‌ కాల్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. క్రెడిట్‌కార్డులు, లోన్లు తదితర సేవల పేరుతో పదుల సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఈ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫిల్టర్లను ఉపయోగించాలని టెలికాం సంస్థలను ట్రాయ్‌ ఆదేశించింది. ఏఐ ఫిల్టర్‌ యూజర్స్‌కు టెలిమార్కెటింగ్‌కు సంబంధించిన కాల్స్‌ రాకుండా చూస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌ సహాలు కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవలు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular