Google విధాత: గూగూల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 7000కోట్ల జరిమానా విధించింది. గూగూల్‌పై భారత దేశంలో ఇదే అతిపెద్ద జరిమానా. గూగూల్ తన పాపులర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ద్వారా భారతీయ మొబైల్‌యాప్ డెవలపర్లకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఈ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ కోసం గూగూల్ తన పేటెంట్ లైసెన్సింగ్ పథకాలను బలవంతంగా అమలు చేసిందని సీసీఐ తెలిపింది. ఈ కారణంగా భారతీయ యాప్ డెవలపర్లు తమ యాప్‌లను గూగూల్ యాప్ స్టోర్‌లో […]

విధాత: గూగూల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 7000కోట్ల జరిమానా విధించింది. గూగూల్‌పై భారత దేశంలో ఇదే అతిపెద్ద జరిమానా. గూగూల్ తన పాపులర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ద్వారా భారతీయ మొబైల్‌యాప్ డెవలపర్లకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ ఈ జరిమానా విధించింది.
ఆండ్రాయిడ్ కోసం గూగూల్ తన పేటెంట్ లైసెన్సింగ్ పథకాలను బలవంతంగా అమలు చేసిందని సీసీఐ తెలిపింది. ఈ కారణంగా భారతీయ యాప్ డెవలపర్లు తమ యాప్‌లను గూగూల్ యాప్ స్టోర్‌లో లిస్టు చేయడానికి అధిక రుసుం చెల్లించాల్సివచ్చిందని సీసీఐ ఆక్షేపించింది.
భారతీయ యాప్ డెవలపర్లను తమ మొబైల్ పరికరాల్లో గూగూల్ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగూల్ ఒత్తిడి చేసిందని సీసీఐ ఆరోపించింది.
అయితే 7వేలకోట్ల జరిమానా నిర్ణయాన్ని గూగూల్ సవాల్ చేసింది. భారతీయ పోటీ చట్టాలను అనుసరిస్తున్నట్లుగా కంపనీ పేర్కోంది. గూగూల్‌కు సీసీఐ విధించిన జరిమానా భారతీయ మార్కెట్లో గూగూల్ స్థానాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
