విధాత: గవర్నర్‌ తమిళిసై కొమురవెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌, సీపీ గవర్నర్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. వీరభైరన్‌పల్లికి రావడం గర్వంగా ఉందన్నారు. పింఛన్‌ రాని పోరాట యోధులకు పింఛన్‌ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీరభైరన్‌పల్లిని పర్యాటకం చేస్తే నేటి తరాలకు […]

విధాత: గవర్నర్‌ తమిళిసై కొమురవెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌, సీపీ గవర్నర్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. వీరభైరన్‌పల్లికి రావడం గర్వంగా ఉందన్నారు.

పింఛన్‌ రాని పోరాట యోధులకు పింఛన్‌ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీరభైరన్‌పల్లిని పర్యాటకం చేస్తే నేటి తరాలకు స్ఫూర్తిగా ఉంటుంది. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

గవర్నర్‌ తమిళిసైకి మళ్లీ అవమానం

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు ఆమెకి స్వాగతం పలుకడం లేదు. ఈ విషయమై గవర్నర్ పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదు.

తాజాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై గురువారం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లగా సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం స్వాగతం పలికేందుకు సైతం ముందుకు రాలేదు. డీఆర్‌వో, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు.

Updated On 10 Nov 2022 8:56 AM GMT
krs

krs

Next Story