HomelatestMinister Jagdish Reddy | 196 మంది ఆర్టిజన్లకు ఊరట.. తిరిగి విధుల్లోకి: మంత్రి జగదీశ్‌...

Minister Jagdish Reddy | 196 మంది ఆర్టిజన్లకు ఊరట.. తిరిగి విధుల్లోకి: మంత్రి జగదీశ్‌ రెడ్డి

Minister Jagdish Reddy |

విధాత: వేతనాలు పెంచాలని అడిగినందుకు విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను తొలగించిన యజమాన్యం.. ఇంటా, బయటా వస్తున్న విమర్శల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి (Minister Jagdish Reddy) నేతృత్వంలో విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్రావు, మజ్లిస్ ఎమ్మెల్యే బలాలాతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలవంతం కావడంతో తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధులకు గైర్హాజరై విధుల్లో నుండి తొలగించ బడిన ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లను దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్ మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే మానవీయ కోణంలోనే 196 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సమ్మె పేరుతో విధులకు గైరాజరైన 196 మంది ఆర్టిజన్లను విధుల్లో నుండి శాశ్వతంగా తొలగిస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ తరహా సంఘటనలు పునావృతం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులకు సూచించారు. పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని ట్రాన్స్‌కో, జన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హెచ్చరించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular