విధాత: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ(paper leakage)వ్యవహారంపై గవర్నర్ తమిళిసై(Governor Tamilisai)స్పందించారు. 48 గంటల్లో నివేదిక(Report)ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు.
ప్రశ్నపత్రం లీకేజీని గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ప్రతిపాదించాలన్నారు.