అర్ధాంతరంగా అసెంబ్లీని వీడి వెళ్లిపోయిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి గవర్నర్‌ చర్య రాజ్యంగ ధిక్కారమని సీఎం స్టాలిన్ ఆరోప‌ణ‌ విధాత: తమిళనాడు అసెంబ్లీ అధికార, విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో గవర్నర్‌ పాత్ర మరో సారి చర్చనీయాంశం, వివాదాస్పదం అయ్యింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని కాకుండా అసలు ప్రతిని మాత్రమే అసెంబ్లీ రికార్డుల్లో పొందు పర్చాలనే తీర్మానాన్ని అసెంబ్లీ […]

  • అర్ధాంతరంగా అసెంబ్లీని వీడి వెళ్లిపోయిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి
  • గవర్నర్‌ చర్య రాజ్యంగ ధిక్కారమని సీఎం స్టాలిన్ ఆరోప‌ణ‌

విధాత: తమిళనాడు అసెంబ్లీ అధికార, విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో గవర్నర్‌ పాత్ర మరో సారి చర్చనీయాంశం, వివాదాస్పదం అయ్యింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని కాకుండా అసలు ప్రతిని మాత్రమే అసెంబ్లీ రికార్డుల్లో పొందు పర్చాలనే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అర్ధాంతరంగా అసెంబ్లీని వీడి వెళ్లిపోవటం చర్చనీయాంశం అవుతున్నది.

సాధారణంగా… ప్రభుత్వం తరపున క్యాబినెట్‌ రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ అసెంబ్లీలో చదవాలనేది రాజ్యంగబద్ధ నియమం. కానీ తమిళనాడు గవర్నర్‌ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠంలోని కొన్ని భాగాలను వదిలేసి చదివారు. అలా చదవటాన్ని అధికార డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. అలా వదిలేయటం రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. గవర్నర్‌ చర్య రాజ్యంగ ధిక్కారమని ఆరోపించారు.

ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థపై తీవ్ర వివాదం చెలరేగుతున్నది. స్థానిక ప్రభుత్వాలను గవర్నర్‌ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ క్రమంలోనే అనేక రాష్ట్రాల్లో యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్స్‌గా గవర్నర్‌ ఉండకుండా తీర్మానం చేయటం గమనార్హం. ఒక రాజ్యాంగ ప్రతినిధిగా గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించటం గర్హనీయం.

Updated On 9 Jan 2023 11:47 AM GMT
krs

krs

Next Story