TSRTC Bill ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు విధాత : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. బిల్లుకు సంబంధించి తాను చేసిన పది సిఫారసుల విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై సంతృప్తి చెందిన గవర్నర్ తాజాగా ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపడంతో తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా […]

TSRTC Bill

  • ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు

విధాత : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. బిల్లుకు సంబంధించి తాను చేసిన పది సిఫారసుల విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై సంతృప్తి చెందిన గవర్నర్ తాజాగా ఆర్టీసీ విలీన బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపడంతో తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను గవర్నర్ అభినందించారు. నెలరోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు గవర్నర్ నెల రోజుల తర్వాత ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ నెరవేరింది. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్ గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం ద్వారా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపారు. నష్టాలలో ఉన్నప్పటికీ నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజల సంస్థగా ఆర్టీసీ కొనసాగుతుంది. ఒక దశలో ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా సాగుతుందని ఆందోళన చెందినప్పటికీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంలో విలీనమైంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 43% ఫిట్మెంట్, వేతనాలు పెంచారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడ కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. క్రమంగా నష్టాలు తగ్గించుకుంటు వస్తుంది . ప్రభుత్వంలో విలీనం కావడం ద్వారా ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

Updated On 15 Sep 2023 2:32 AM GMT
somu

somu

Next Story