నేడో, రేపు జీవో విడుదల ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న 4,500 మంది విధాత: ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్మెంటే తప్పా రిక్రూట్‌మెంట్స్‌ లేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్ట్‌ వ్యవస్థ అనేదే ఉండదని ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదే పదే ప్రస్తావించేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ క్లాస్‌ 4 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, గెజిటెడ్ పోస్టులను క్రమబద్ధీకరిస్తే […]

  • నేడో, రేపు జీవో విడుదల
  • ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న 4,500 మంది

విధాత: ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్మెంటే తప్పా రిక్రూట్‌మెంట్స్‌ లేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్ట్‌ వ్యవస్థ అనేదే ఉండదని ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదే పదే ప్రస్తావించేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ క్లాస్‌ 4 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, గెజిటెడ్ పోస్టులను క్రమబద్ధీకరిస్తే తమకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో నియామకంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదని కాబట్టి దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో ఆ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.

అలాగే ఈ ఏడాది మార్చి 10న రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించారు. 91,142 ఖాళీలను గుర్తించామని అందులో 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో 11,103 కాంట్రాక్టు పోస్టులను పర్మినెంట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చి కూడా దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నది. నియామక ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది.

అలాగే కాంట్రాక్ట్‌ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసు చాలా ఏళ్లు కోర్టులో నడిచింది. ఈ ఏడాది జూలైలో ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో జూనియర్‌ కాలేజీల్లో సుమారు 3500 మంది, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 500 మంది, ఢిగ్రీ కాలేజీల్లో 500 పనిచేస్తున్నారు. వాళ్లంతా ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూస్తున్నారు.

కోర్టు తీర్పు అనంతరం కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న జీవో 16 ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా కాంట్రాక్టు లెక్చరర్స్‌ క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. దీనిపై నేడో, రేపో జీవో విడుదలకు అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచాచారం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 4,500 మంది కాంట్రాక్టు లెక్చరర్స్‌ చిరకాల కోరిక నెరవేరనున్నది.

Updated On 15 Nov 2022 10:30 AM GMT
krs

krs

Next Story