పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానిస్తారని ప్రచారం ఇప్పటికే రాష్ట్రపతి ఉత్వర్వుల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని మార్పు Bharat | విధాత: దేశంలో ఏమని పిలుచుకన్నా.. మన దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఇండియా అనే పిలుస్తారు. తాజాగా దీనిని భారత్ అని మార్చే విధంగా రాజ్యాంగబద్ధ ప్రక్రియకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్ అనే మార్చేందుకు అన్నీ సిద్ధమయ్యాయని అస్సాం ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ […]

- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానిస్తారని ప్రచారం
- ఇప్పటికే రాష్ట్రపతి ఉత్వర్వుల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని మార్పు
Bharat | విధాత: దేశంలో ఏమని పిలుచుకన్నా.. మన దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఇండియా అనే పిలుస్తారు. తాజాగా దీనిని భారత్ అని మార్చే విధంగా రాజ్యాంగబద్ధ ప్రక్రియకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్ అనే మార్చేందుకు అన్నీ సిద్ధమయ్యాయని అస్సాం ముఖ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'రిపబ్లిక్ ఆఫ్ భారత్.. అమృత కాలంలో ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాం' అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికార పార్టీ నాయకుడు చెప్పినందున ఇది నిజమే అయ్యుంటుందని కొందరు భాష్యం చెప్పారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్ని షెడ్యూల్ చేసినందున.. వాటిల్లో ప్రవేశపెట్టబోయే తీర్మానాల్లో ఇండియా పేరు మార్పు కూడా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు జైరాం రమేశ్ కూడా పేరు మార్పు తథ్యమనే చెబుతున్నారు. జీ-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందు ఆహ్వానాన్ని అందుకున్నానని.. దానిపై గతంలోలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉందని తెలిపారు.
దీనిని బట్టి పేరు మార్పు నిజమే అనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. భారత్.. ఒకప్పుడు ఇండియా (Bharat That Was India) అని చదువుకోవాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్‌కు కూడా ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్.. అని ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జైరాం మరో అడుగు ముందుకేసి.. ఇది ఇండియా కూటమిపై దాడి అని విమర్శించడం విశేషం.
భారత్ మాజీ క్రికెట్ దిగ్గజం ఈ నెల రెండో తేదీన.. భారత్ వర్సెస్ నేపాల్ అంటూ ఆసియా కప్ మ్యాచ్ గురించి ఒక ట్వీట్ చేశాడు. పేరు మార్పు గురించి మీకు సమాచారం ఉందా అని ఒక యూజర్ అడగ్గా.. ఉందంటూ వీరు బదులివ్వడం విశేషం. సింధు నదిని గ్రీకులు ఇండస్ అని పిలవడం వల్ల ఆ నదికి అవతలి వైపు ఉండేవారిని ఇండియన్స్ అని.. ఆ దేశాన్ని ఇండియా అని పిలవడం మొదలైంది. భారత్ విషయానికి వస్తే మొదటిగా ఈ పదాన్ని విష్ణు పురాణంలో ప్రస్తావించినట్లు నిపుణులు చెబుతున్నారు.
