నక్కలగండి నిర్వాసితులకు చెక్కుల పంపిణీ విధాత : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నక్కలగండి రిజర్వాయర్ కింద భూమి, ఇండ్లు కోల్పోయిన మోత్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగండి తండాకు చెందిన రైతులకు రూ.25 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్కలగండి రిజర్వాయర్ కింద ముంపునకు గురైన కుటుంబాలకు అన్ని వసతులు కల్పించనున్నట్లు […]

  • నక్కలగండి నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

విధాత : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నక్కలగండి రిజర్వాయర్ కింద భూమి, ఇండ్లు కోల్పోయిన మోత్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగండి తండాకు చెందిన రైతులకు రూ.25 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్కలగండి రిజర్వాయర్ కింద ముంపునకు గురైన కుటుంబాలకు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఎకరాకు సాగు, తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కువ రిజర్వాయర్లు గల నియోజకవర్గంగా దేవ‌ర‌కొండ నిలుస్తుంద‌న్నారు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణ‌పడి ఉండాలని కోరారు.

రైతుబంధు, రైతుబీమా దేశానికి ఆదర్శమ‌ని పేర్కొన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదింటి ఆడబిడ్డ‌ల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు, వృద్ధులు తదితరులకు 2016, వికలాంగులకు 3016 రూపాయల పింఛన్ ఇస్తున్న‌ట్లు గుర్తుచేశారు.

కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరాం, జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్రావు, రాజినేని వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నాగార్జున్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, స్థానిక సర్పంచ్ అర్జున్సింగ్, కున్‌రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated On 4 Jan 2023 4:41 PM GMT
krs

krs

Next Story